పట్టింపేది?
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
● దారులన్నీ గుంతలమయం ● 22 రోజుల్లో జాతర..
● నేటికీ ప్రారంభం కాని పనులు ● పలు జిల్లాల నుంచి రానున్న భక్తులు
చిట్యాల: మండలంలోని వెంచరామి శివారులోని పూరేడు గుట్ట వద్ద శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతర ప్రతీ రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా జరుగుతుంది. జాతరకు కేవలం 22 రోజుల సమయం మాత్రమే ఉన్నా కనీసం ఇప్పటి వరకు పనులేవీ ప్రారంభం కాలేదు. జాతరకు ప్రతీ యేటా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పనులకు మోక్షం కలగడం లేదు.


