ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకుడు ఫణీందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం నంబర్ 9030632608కు కాల్ చేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్, భద్రత, తరలింపులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
కేంద్రాల పరిశీలన..
మున్సిపాలిటీ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకుడు ఫణీందర్‌రెడ్డిలు వేర్వేరుగా పరిశీలించి నోడల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రిటర్నింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సాధారణ పరిశీలకులుగా నియమితులైన ఫణీందర్‌రెడ్డి శుక్రవారం నుంచి జెన్‌కో అతిథి గృహంలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే నేరుగా లేదా ఫోన్ నంబర్ 9949992992 ద్వారా తెలియజేయాలని ఫణీందర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ సీమెన్స్, ప్రథం సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లతో పాఠశాల విద్యలో(స్టెమ్) సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌పై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో స్టెమ్ విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, సీమెన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ శివకుమార్, ప్రథం రాష్ట్ర కో ఆర్డినేటర్ సుధాకర్ పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ, పరిశీలకుడు ఫణీందర్‌రెడ్డి
మున్సిపల్ ఎన్నికలపై
నోడల్ అధికారులతో సమావేశం


