మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సందడి చేశారు. అలాగే సమ్మక్క– సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌రావు అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శమని తెలిపారు.


