దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

దుష్ప

దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు

దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు ఆర్‌యూపీపీటీఎస్‌ జిల్లా కమిటీ శిలాఫలకాలు ధ్వంసం చేయడం సిగ్గుచేటు

భూపాలపల్లి రూరల్‌: మున్సిపాలిటీ అభివృద్ధిపై కొంతమంది బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మున్సిపాలిటీలోని సుభాష్‌కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీలో పల్లె దవాఖానాలను డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండున్నరేళ్ల కాలంలో చేసిన, చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలో ప్రజలు తగిన బుద్ధిచెబుతారన్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్‌లో మేడారం బస్సు పా యింట్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. డిపో నుంచి 80 బస్సు సర్వీసులు మేడారం జాతరకు నడుపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎం ఇందూ, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, వార్డు ఇన్‌చార్జ్‌లు, పార్టీ కారకర్తలు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: ఆర్‌యూపీపీటీఎస్‌ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ తెలంగాణ) జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ములుకనూరి శంకర్‌లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా కడెం రాజేందర్‌, ప్రధాన కార్యదర్శిగా పెనుకుల యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. పండితుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని నూతన కమి టీ సభ్యులు తెలిపారు. వేముల రవికుమార్‌, పోతుల మురళీధర్‌, కత్రోజు వెంకటేశ్వర్లు, మడిపల్లి రమేష్‌, కొలిపాక శ్రీనివాస్‌, గుండు రమేష్‌, అశోక్‌, పూర్ణచందర్‌లు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ధ్వంసం చేయడం సిగ్గు చేటని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్‌ కాలనీలో ధ్వంసం చేసిన శిలాఫలకాలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంజూరు చేసి శంకుస్థాపన చేసిన హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ పనులకు సంబంధించిన శిలాఫలకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తామననడం కక్ష్యపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. వారి వెంట స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దుష్ప్రచారాలను  ప్రజలు నమ్మొద్దు1
1/2

దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు

దుష్ప్రచారాలను  ప్రజలు నమ్మొద్దు2
2/2

దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement