విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Jan 23 2026 7:03 AM | Updated on Jan 23 2026 7:03 AM

విధుల్లో నిర్లక్ష్యం  వహిస్తే కఠిన చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో బాధ్యతాయుతమైన దర్యాప్తు జరగడం వలనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. నేరస్తులకు శిక్షపడేలా అధికారులు సమర్థవంతంగా పనిచేశారని పేర్కొన్నారు. పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి జాప్యం లేకుండా విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌ కుమార్‌, డీఎస్పీ సంపత్‌రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement