పుణ్యస్నానాలు.. మొక్కులు
మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గురువారం తరలివచ్చారు. తొలుత జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి వనదేవతల వద్దకు చేరుకుని మొక్కులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. ఒడిబియ్యాన్ని సమర్పించి హుండీలలో కానుకలు వేశారు. పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుని ఎదురుకోడి పిల్ల మొక్కులు చెల్లించారు. గద్దెల వద్ద గేట్లు వేసి ఉండడంతో ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ నుంచి వచ్చిన భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలగడంతో డీఎస్పీ రవీందర్ గద్దెల వద్దకు చేరుకొని ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేసి సరదాగా గడిపారు. – ఎస్‌ఎస్‌తాడ్వాయి
పుణ్యస్నానాలు.. మొక్కులు
పుణ్యస్నానాలు.. మొక్కులు


