కలెక్టరేట్‌లో 24 గంటలు హెల్ప్‌డెస్క్
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24/7 గంటల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సూచనలను హెల్ప్ డెస్క్ మొబైల్ నంబర్ 90306 32608కు తెలియజేయాలన్నారు.
మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అబ్బాస్, నవీన్ పాల్గొన్నారు.
పారదర్శకంగా నిర్వహించాలి..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఫణీంద్రరెడ్డి సూచించారు. శనివారం ఆయన భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత గల నామినేషన్లను మాత్రమే చెల్లుబాటు చేయాలని, పొరపాట్లకు అవకాశం లేకుండా ప్రతీ నామినేషన్‌ను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఆయన వెంట సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ రాహుల్ శర్మ


