కాళేశ్వరం దేవస్థానం హుండీల లెక్కింపు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, అనుబంధ దేవాలయాల హుండీలను శుక్రవారం లెక్కించారు. మూడు నెలల హుండీల ఆదాయం రూ.34,42,598 లక్షలు సమకూరినట్లు ఈఓ ఎస్.మహేష్ తెలిపారు. హుండీల పర్యవేక్షణను దేవాదాయశాఖ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది, దేవస్థానం అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది, శ్రీ వల్లి సేవా ట్రస్ట్ (కరీంనగర్), శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, నరసింహ సేవా సమితి (హైదరాబాద్) సభ్యులు, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు
పకడ్బందీ ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ ఆదేశించారు. శుక్రవారం భూపాలపల్లి మున్సి పాలిటీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. పనుల పురోగతి వివరాలను కమిషనర్ ఉదయ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు కలగకుండా ఎన్నికలను ప్రశాంత వాతా వరణంలో నిర్వహించాలని సూచించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీపీఓ సునీల్‌కుమార్, కార్యాలయ మేనేజర్ సుభాష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
గోదారంగనాథుల
కల్యాణ ఉత్సవం
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణాన్ని కనుల పండగగా గురువారం నిర్వహించారు. భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ కల్యాణం కమనీయంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాథచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామి వారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి గోదా రండనాయక స్వామి వారికి ఒడి బియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
పార్కింగ్ స్థలాల పరిశీలన
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా పార్కింగ్ స్థలాలు, రహదారులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వాహనాలకు పాత నక్ష ప్రకారం కన్నెపల్లి వంతెన గుండా రహదారి పక్కన 20–30 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని, వరంగల్ గుండా వచ్చే వాహనాలకు వన్‌వే మీదుగా వచ్చే వాహనాలకు పూస్కుపల్లి, కాళేశ్వరం వద్ద పార్కింగ్ స్థలాలు పరిశీలించారు. వారి వెంట ఎస్సై తమాషారెడ్డి తదితరులు ఉన్నారు.
కాళేశ్వరంలో
ఫ్రాన్స్ దంపతుల సందడి
కాళేశ్వరం: ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫిలిఫ్స్–క్యాచీ దంపతులు కాళేశ్వరంలో శుక్రవారం కలియ తిరుగుతూ సందడి చేశారు. రెండు రోజులుగా హరిత హోటల్‌లో బస చేసి కాళేశ్వరాలయం, గోదావరి పరిసరాలు, వీఐఫీ ఘాటుతో పాటు గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాలను చుట్టేశారు. సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులతో ముచ్చటించారు. శుక్రవారం వీఐఫీఘాటు వద్ద నిత్య హారతి కార్యక్రమంలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. గ్రామంలోని పలువురు ఇళ్లలో కాసేపు కూర్చుని ముచ్చటించారు. దీంతో వారిని చూసేందుకు, మాట్లాడటానికి గ్రామస్తులు సంబురపడ్డారు.
కాళేశ్వరం దేవస్థానం హుండీల లెక్కింపు
కాళేశ్వరం దేవస్థానం హుండీల లెక్కింపు
కాళేశ్వరం దేవస్థానం హుండీల లెక్కింపు


