ప్రమాదవశాత్తు కారు దగ్ధం
● మేడిపల్లి టోల్‌ప్లాజా వద్ద తప్పిన ముప్పు
మల్హర్(కాటారం): ప్రమాదవశాత్తు ఓ కారు దగ్ధమైన ఘటన కాటారం మండలంలోని మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వరంగల్‌కు చెందిన ఇద్దరు కారులో కాళేశ్వరం వెళ్తున్నారు. టోల్ ప్లాజా వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బయటకు రావడంతో పెనుప్రమాదం తప్పింది. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో కారు పూర్తిగా కాలిపోయింది. కాటారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.
అదుపుతప్పి కారు బోల్తా
మల్హర్(కాటారం): కారు అదుపు తప్పి కల్వర్డును ఢీకొట్టడంతో బోల్తా పడిన ఘటన కాటారం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామానికి చెందిన దేవేందర్, సురేష్ కాటారం(గారెపల్లి) నుంచి మంథని వైపున వెళ్తున్నారు. మండలకేంద్రంలోని సొసైటీ బ్యాంకు వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు కారులోనే ఇరుక్కుపోయి గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు వారిని బయటకు తీసి తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదవశాత్తు కారు దగ్ధం


