సరిపడా యూరియా నిల్వలు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో యాసంగి పంటలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బా బురావు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. వదంతులు నమ్మి అవసరానికంటే ఎక్కువగా యూరియా బస్తాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. నిల్వ చేయడం వలన మిగతా రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 3,787 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఎరువుల అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1893098307ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మద్యం తాగి
వాహనం నడపొద్దు
చిట్యాల: వాహనదారులు మద్యం తాగి వాహనం నడపవద్దని జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం మండలకేంద్రంలో ఎస్సై శ్రావన్‌కుమార్‌తో కలిసి వెంకట్రావుపల్లి(సీ) నుంచి విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం డీటీఓ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ప్రతీ వాహనదారుడికి లైసెన్స్ తప్పకుండా ఉండాలన్నారు. 18ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని అన్నారు. అనంతరం విద్యార్థులు మానవహారం చేపట్టారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేవారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ సుందర్‌లాల్, శ్రీనివాస్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
సరిపడా యూరియా నిల్వలు
సరిపడా యూరియా నిల్వలు


