అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు

Jan 19 2026 4:15 AM | Updated on Jan 19 2026 4:15 AM

అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు

అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు

అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై కొందరు కావాలని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని.. వాటిని తక్షణమే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పష్టంచేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ రెండేళ్లలో భూపాలపల్లి మున్సిపాలిటీలో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు రెండు రోజుల క్రితం జీఓలు తీసుకొచ్చామని తెలిపారు. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో 30 వార్డుల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గ్రామంలో సలేంద్ర శ్రూకేష్‌ స్మారకార్థం గొల్లబుద్ధారం యువత ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్‌ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుంకరి కిరణ్‌, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement