ఓటు హక్కు పవిత్రమైనది
భూపాలపల్లి అర్బన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, అర్హత కలిగిన ప్ర తీఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ పిలు పునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన 16వ జాతీ య ఓటరు దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేసి, సీనియర్ సిటిజన్ ఓటర్లను సత్కరించారు. ఓటరు అవగాహనపై ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థుల సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలరన్నారు. యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకొని ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన బీఎల్‌ఓ, సూపర్‌వైజర్లు చేంజ్, ఆపరేటర్లుకు ప్రశంసపత్రాలు అందించారు. అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


