సరస్వతి మహాభాగే | - | Sakshi
Sakshi News home page

సరస్వతి మహాభాగే

Jan 24 2026 7:25 AM | Updated on Jan 24 2026 7:25 AM

సరస్వ

సరస్వతి మహాభాగే

కాళేశ్వరం: చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమిని పురస్కరించుకొని కాళేశ్వరం దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తులు పోటెత్తారు. శుక్రవారం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు రామకృష్ణ, బైకుంఠ పాండా, శరత్‌చంద్ర, పవన్‌శర్మ, శ్రావణ్‌కుమార్‌, రాధాకృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. అంతకుముందు సరస్వతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పట్టువస్త్రాలతో ముస్తాబు చేసి పూలతో అలంకరించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భక్తులు తరలివచ్చారు. చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలను దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆలయం తరఫున పలక, బలపాలు అందజేశారు. మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. దీంతో ఆలయం ఆవరణలో భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ప్రసాదం వితరణ చేఽశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వీఐపీఘాటు వద్ద ఏర్పాటుచేసిన సరస్వతిమాత విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎస్‌.మహేష్‌, మాజీ దేవస్థానం ధర్మకర్త అశోక్‌, మాజీ సర్పంచ్‌ మాధవి, భక్తులు పాల్గొన్నారు.

కాళేశ్వరంలో వసంత పంచమి

ప్రత్యేక పూజలు

ఆలయంలో సామూహిక

అక్షరస్వీకారాలు

సరస్వతి మహాభాగే 1
1/1

సరస్వతి మహాభాగే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement