మహా భక్తులకు కష్టాలు
కాళేశ్వరం: మేడారం జాతరకు తరలిపోతున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ భక్తులకు మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్ వంతెన మీదుగా ఇంజనీర్లు, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు వద్ద భక్తులు నిరీక్షిస్తున్నారు. మంగళవారం ఆయా రాష్ట్రాల నుంచి మేడారం వెళ్లేందుకు తరలిరాగా గేటు వద్ద అనుమతి లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం తమకు అనుమతి కల్పించాలని వేడుకుంటున్నారు. కాళేశ్వరం మీదుగా వెళ్లాలంటే రవాణా కష్టాలతో ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొంటున్నారు.
భూపాలపల్లి అర్బన్: కాటారం–మేడారం ప్రధాన రహదారిలో సరైన రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మేడారం సమీపంలోని కాల్వపల్లి–మహాముత్తారం మండలం సింగారం గ్రామాల మధ్య రోడ్డు మరమ్మతు పనులు పూర్తి కాలేదు. రోడ్డుపై గుంతలు పూడ్చే క్రమంలో అధికారులు కంకర పోసి వదిలేశారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుంచి జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్నా.. అధికారులు పనులెప్పుడు పూర్తిచేస్తారని మండిపడుతున్నారు.
భూపాలపల్లి రూరల్: ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతానని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బూరుగు రవికుమార్ ఆధ్వర్యంలో టీఎన్‌జీఓ డైరీని కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్లు విజయలక్ష్మి, అశోక్ కుమార్, ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి దశరథ రామారావు, సంఘం నాయకులు షఫీ అహ్మద్, జ్ఞానేశ్వర్ సింగ్, సురేందర్‌రెడ్డి, అన్వార్ భైగ్, వంశీ కృష్ణ, మురళీధర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీదేవి పాల్గొన్నారు.
● ఇద్దరి దుర్మరణం
మల్హర్(మహాముత్తారం): మేడారం జాతర నేపథ్యంలో సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్తున్న ట్రాక్టర్ మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 10 మందికి పైగా వ్యక్తులు ట్రాక్టర్‌లో మేడారం జాతరకు బయలుదేరారు. ఈ క్రమంలో మహాముత్తారం మండలం నిమ్మగూడెం, పెగడపల్లి సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మి(45), అక్షిత (20) మృతిచెందగా పలువురికి తీవ్రగాయాలు అయినట్లు తెలిసింది.
మహా భక్తులకు కష్టాలు
మహా భక్తులకు కష్టాలు


