స్వామి వివేకానంద స్ఫూర్తితో..
అభివృద్ధి చేస్తామంటున్న యువ సర్పంచ్‌లు
ఎమ్మెస్సీ పూర్తిచేసి మెడికల్ కోడింగ్‌లో ఉద్యోగం చేస్తూ ఇటీవల సర్పంచ్‌గా బరిలో దిగి విజయం సాధించాను. కేవలం 25 సంవత్సరాల వయస్సులో సర్పంచ్‌గా నాకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజల వెన్నంటే ఉంటా. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరేలా కృషి చేస్తా. యువకులు రాజకీయంలో విజయాలు సాధిస్తారనే నమ్మకంతో బరిలో దిగి విజయం సాదించాను.
– ఇసంపెల్లి హారిక, ఎంపేడు సర్పంచ్, టేకుమట్ల
రెండు దశాబ్ధాలుగా నాన్న సంగి రవి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రభావంతోనే బీఎస్సీ నర్సింగ్ చేసిన నేను చిన్న వయసులోనే(23) రాజకీయంలో అడుగుపెట్టాను. సర్పంచ్‌గా ప్రజలు బాధ్యతను కట్టబెట్టారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. యువతులు సైతం అభివృద్ధి చేస్తారనేలా సేవ చేసి ప్రజలతో శభాష్ అనిపించుకుంటాను.
– సంగి అంజలి, దుబ్యాల సర్పంచ్, టేకుమట్ల
స్వామి వివేకానంద స్ఫూర్తితో..
స్వామి వివేకానంద స్ఫూర్తితో..


