ముగిసిన నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పర్వం

Jan 31 2026 7:13 AM | Updated on Jan 31 2026 7:13 AM

ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం

ముగిసిన నామినేషన్ల పర్వం

భూపాలపల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో తొలిపర్వం ముగిసింది. మూడురోజుల పాటు నామినేషన్ల స్వీక రణ ప్రక్రియ కొనసాగగా చివరిరోజు భారీ సంఖ్య లో అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేశారు.

ఒక్కరోజే 230..

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో స్వీకరించారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు 4 నామినేషన్లు, 29న 19 మంది 20 నామినేషన్లు దాఖలు చేశారు. 30న 176 మంది 230 నామినేషన్లు వేసినట్లు ము న్సిపల్‌ కమిషనర్‌ జోనా వెల్లడించారు. మొత్తంగా 198 మంది అభ్యర్థులు 254 నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించారు.

పార్టీల వారీగా..

బీఎస్‌పీ 2, బీజేపీ 30, సీపీఐ 7, సీపీఎం 2, కాంగ్రెస్‌ 65, బీఆర్‌ఎస్‌ 83, జనసేన 4, ఏఐఎఫ్‌బీ 3, ఇతర పార్టీలు 8, స్వతంత్రులు 26 మంది మొత్తంగా 254 నామినేషన్లను దాఖలు చేశారు.

గల్ల పెట్టె గలగల...

ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి భారీగా ఆదాయం వచ్చింది. నామినేషన్లు వేసే అ భ్యర్థులు ఆస్తి పన్నులు పూర్తిగా చెల్లించాలనే నిబంధన ఉండటంతో 198 మంది తమ ఆస్తి పన్నులను చెల్లించారు. 28వ తేదీన రూ.4,86,492, 29న రూ.8,53,589, శుక్రవారం రూ.6,42,893, మొత్తంగా రూ.19,82,974 ఆస్తి పన్ను వసూలు అయినట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ వెల్లడించారు.

భూపాలపల్లిలో 30 వార్డులు

198 మంది అభ్యర్థులు 254 నామినేషన్లు

చివరి రోజు భారీగా 230 దాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement