ఎన్నికల నియమావళిని పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళిని పాటించాలి

Feb 5 2026 7:36 AM | Updated on Feb 5 2026 7:36 AM

ఎన్నికల నియమావళిని పాటించాలి

ఎన్నికల నియమావళిని పాటించాలి

ఎన్నికల నియమావళిని పాటించాలి

భూపాలపల్లి: పోటీచేసే అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, అడిషనల్‌ కలెక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళిపై పోటీ చేసే అభ్యర్థులకు వివరించారు. మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 107 మంది అభ్యర్థుల ఎన్నికల్లో పోటీలో ఉన్నారని, ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థికి ఎన్నికల నియమావళి ప్రకారంగా ఖర్చులు, ర్యాలీలు, లౌడ్‌ స్పీకర్‌ పర్మిషన్‌, వాహన పర్మిషన్లు తీసుకునే విధానం, వాడుక విధానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జోనా, డీఎస్పీ సంపత్‌రావు, సీఐ నరేష్‌, నోడల్‌ ఆఫీసర్‌ నాగ వైష్ణవి, జిల్లా అబ్జర్వర్‌ నరేష్‌, సుకుమార్‌, ఎంపీడీఓ తరుణ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అదనపు ఎన్నికల అఽధికారి

విజయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement