ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ
మల్హర్: మండలంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వృత్తివిద్య ప్రయోగ (ప్రాక్టికల్) పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జి.వెంకన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం జరిగిన పరీక్షకు 15 మంది విద్యార్థులకు గాను 12 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో 27 మందికి 27 మంది విద్యార్థులు హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెంకట్‌రెడ్డి తెలిపారు.
భక్తులను అవమాన పరిచారని ఫిర్యాదు
కాళేశ్వరం: కాళేశ్వరానికి వచ్చే భక్తులకు ఎలాంటి అవమానం జరగొద్దని ఈఓకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తులు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని వీఐపీ ఘాటులో హైదరాబాద్‌కు చెందిన సందీప్ తన తండ్రి అస్తికలు కలిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. బుధవారం అస్తికలు గోదావరిలో కలిసి తీరంపైకి రాగానే అక్కడే ఉన్న ఓ కాంట్రాక్టర్ ఎక్కడపడితే అక్కడ కార్లు పార్కింగ్ చేస్తారా.. అంటూ తమను బూతులు తిడుతూ అవమాన పరిచారని ఫిర్యాదు చేసినట్లు సందీప్ తెలిపారు. ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదని దేవాదాయశాఖ సూచిక బోర్డులు అమర్చలేదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి అవమానం ఎవరికీ జరగకుండా దేవాదాయశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట జనార్దన్, రాఘవ తదితరులు ఉన్నారు.
మల్హర్(కాటారం): జాబ్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్విని యోగం చేసుకోవాలని డీఆర్డీఓ బాలకృష్ణ అన్నారు. మండలంలోని మేడిపల్లి, చిదనపల్లి, కాటారం గ్రామంలోని వాటర్ హర్విస్టింగ్ క మ్యూనిటీ పాండ్ పనులను బుధవారం ఆయన సందర్శించారు. ప్రతీ గ్రామానికి 100 నుంచి 150 మంది కూలీలతో పని చేయించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. రా నున్న రెండు రోజుల్లో లేబర్ సంఖ్య పెంచకుంటే శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు రూ.307 వస్తాయని, పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు, నీడ, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కాటారం, మల్హర్ ఎంపీఓలు, ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంజుల దేవి, డీటీసీ నాగేందర్, కా టారం, మల్హర్ ఏపీఓలు వెంకన్న, హరీష్, ఈసీలు మంగీలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


