కోటగుళ్లలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

కోటగు

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు కేయూలో పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు షురూ కోటను సందర్శించిన ఆడిట్‌ ఆఫీసర్‌

గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య పూజలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందించారు.

రేపు ఢిల్లీలో ధర్నా

భూపాలపల్లి అర్బన్‌: టెట్‌ రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 23(2)ను ఈ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో

తరలిరావాలి

ఢిల్లీలో జరిగే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌, తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్‌ను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్‌ ప్రొఫెషనల్‌) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. క్యాంపస్‌లోని పలు కేంద్రాలను పరీక్షల విభాగం అధికారులు సందర్శించారు. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య టి.మనోహర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.మమత పరిశీలించారు.

పలు పరీక్షలు వాయిదా

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 7, 10వ తేదీల్లో నిర్వహించనున్న బీటెక్‌ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని, 10న నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు, 11న నిర్వహించాల్సిన ఎంబీఏ పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పును కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు గమనించాలని కోరారు.

ఖిలా వరంగల్‌: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌ కోటను మంగళవారం ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సర్వీస్‌ అధికారి అఖిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నల్ల రాతిలో శిల్పులు చెక్కిన శిల్పకళాసంపదను తిలకించారు. అనంతరం ఖుష్‌మహల్‌, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతిమట్టికోట అందాలను వీక్షించారు. కోట గైడ్‌ రవియాదవ్‌ కాకతీయుల శిల్పకళాసంపద, విశిష్టతను ఆయనకు వివరించారు. కోట అందాలను అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది, టీజీటీఎస్‌టీడీసీ అజయ్‌ తదితరులు ఉన్నారు.

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
1
1/3

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
2
2/3

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
3
3/3

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement