రామప్ప శిల్పాలు అద్భుతం
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలోని శిల్పకళ సంపద మరుపురానిదని స్విట్జర్లాండ్ దేశస్తులు కొనియాడారు. చారిత్రక రామప్ప దేవాలయాన్ని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రైస్ బాస్టియన్, కిస్టినా జాక్వెస్‌లు మంగళవారం సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు. ఇండియాన్ ఆడిట్ ఆకౌంట్ సర్వీస్ అధికారి అఖిల్ రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా గైడ్ వెంకటేశ్ ఆలయ విశిష్టతను వివరించారు.


