అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
రేగొండ: వివక్ష, అసమానతలు లేని సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణమే సామాజిక న్యాయ దినోత్సవ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ఎంజేపీ బాలుర గురుకులంలో నిర్వహించిన సామాజిక న్యాయ దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. సమాజంలోని ప్రతీ వర్గానికి సమాన అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బలహీన వర్గాలు, మహిళలు, ది వ్యాంగులు, వెనుకబడిన తరగతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రతీపౌరుడు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం సామాజిక న్యాయం పాటింపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, సహాయ బీసీ సంక్షేమ అధికారి క్రాంతికిరణ్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, డీసీఓ స్వప్న, ప్రిన్సిపాల్ అపర్ణ పాల్గొన్నారు.
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మండలంలోని కొడవటంచ ఆలయానికి ఈ నెల 8న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి పరిశీలించారు. దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగు నీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. అంతకుముందు హెలిపాడ్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మల్సూర్ నాయక్, ఆర్ అండ్ బీ ఈఈ రమేష్, ఆర్‌డబ్ల్యూస్ ఈఈ శ్వేత, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంపీఓ రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


