కాంగ్రెస్‌ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

Feb 3 2026 7:42 AM | Updated on Feb 3 2026 7:42 AM

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

మల్హర్‌(కాటారం): కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కదిలి.. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం కాటారం మండలంలోని ధన్వాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. సంక్షేమ పథకాలను ఆయుధాలుగా ప్రజలకు వివరించాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల క్షేత్రంలో పార్టీ జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రెండేళ్లలో సీఎం రేవంత్‌రెడ్డి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడన్నారు. రానున్న మూడేళ్లలో మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement