నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలి
● డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దేవేందర్
మల్హర్(కాటారం): ఆస్పత్రి సిబ్బంది నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దేవేందర్ అన్నారు. గురువారం మండలంలోని కాటారం ప్రాథమిక ఆర్యోకేంద్రంలో కాటారం, అంబటిపల్లి పీహెచ్‌సీ డాక్టర్లు, ఎన్‌సీడీ నర్సింగ్ అధికారులకు, సూపర్‌వైజర్లకు ఎన్‌డీసీ ప్రోగ్రాంపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఎన్‌సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి (డిప్యూటీ డీఎంహెచ్‌ఓ) డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 30 సంవత్సరాల పైబడిన అందరికీ క్షేత్రస్థాయిలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి సకాలంలో ఆన్లైన్ చేయాలని డాక్టర్లు సూచించారు. డాక్టర్లు సకాలంలో పుట్ అన్ ట్రీట్‌మెంట్ పెట్టాలన్నారు. సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించలేని వారు రాబోయే రెండు మాసాల్లో వారి లక్ష్యాలను అధిగమించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య అధికారి డాక్టర్ మౌనిక, అంబటిపల్లి డాక్టర్ కల్యాణి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ లింగారెడ్డి, మురళీధర్, ఎన్‌సీడీ కన్సల్టెంట్ విజయ్ పాల్గొన్నారు.


