యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్'.. వచ్చే నెల 26న థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్‌ని వరసగా వదులుతున్నారు. కొన్నిరోజుల క్రితం హీరోయిన్లకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు యష్-కియారా అడ్వాణీల రొమాంటిక్ సాంగ్ వీడియోని విడుదల చేశారు.
'టాక్సిక్' సినిమాని ముందు నుంచి పెద్దలకు మాత్రమే అని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ కూడా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంది. ఎందుకంటే యష్-కియారా రొమాన్స్ తప్పితే ఇందులో వేరే ఏం లేదు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా మిగతా పాత్రలు చేశారు.
లెక్క ప్రకారం ఈ సినిమా మార్చిలో రిలీజ్ కావాలి. కానీ అరబ్ దేశాల్లో అనిశ్చితి కారణంగా వాయిదా వేశారు. తర్వాత జూన్ 4 అని ప్రకటించారు. కానీ రిలీచ్ చేయలేకపోయారు. ఇప్పుడు చివరగా ఆగస్టు 26వ తేదీని ఫిక్స్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ ఏం లేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ బట్టి చూస్తే రొమాన్స్, ఫైట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.


