దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 118 పాయింట్లు పెరిగి 24,016 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 378 పాయింట్ల లాభంతో 77,042 వద్ద ట్రేడవుతోంది.
విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.16 శాతం, 1.05 శాతం పెరిగాయి.
రంగాల వారీగా, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


