నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Close Sensex Nifty falls 11 June | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Jun 11 2026 3:50 PM | Updated on Jun 11 2026 3:58 PM

Stock Market Close Sensex Nifty falls 11 June

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో సంఘర్షణ తీవ్రమైన కారణంగా రిస్క్ సెంటిమెంట్ దెబ్బతినడతో నిఫ్టీ 50, సెన్సెక్స్ అస్థిర సెషన్ ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 53.35 పాయింట్లు లేదా 0.23 శాతం తగ్గి 23,161.60 వద్ద, సెన్సెక్స్ 150.63 పాయింట్లు లేదా 0.20 శాతం క్షీణించి 73,832.55 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎటర్నల్ నిఫ్టీ 50 ఇండెక్స్‌లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.81 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.67 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ కెమికల్ షేర్లు అత్యధికంగా క్షీణించాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement