శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 964.59 పాయింట్లు లేదా 1.25 శాతం లాభంతో 24,346.15 వద్ద, నిఫ్టీ 273.40 పాయింట్లు లేదా 1.14 శాతం లాభంతో 24,346.15 వద్ద నిలిచాయి.
రిలాక్సో ఫుట్‌వేర్స్ లిమిటెడ్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, పార్ డ్రగ్స్ & కెమికల్స్ లిమిటెడ్, వర్చుసో ఆప్టోఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్రిండ్‌వెల్ నార్టన్ లిమిటెడ్, నవ్‌కర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


