మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 893.39 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 76,200.68 వద్ద, నిఫ్టీ 278.80 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 23,824.10 వద్ద నిలిచాయి.
ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ఓరియంటల్ హోటల్స్ లిమిటెడ్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. రోసెల్ టెక్సిస్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్, గంగా ఫోర్జింగ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


