లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఐటీ షేర్లకు మంచిరోజు | Stock Market Close Sensex jumps 579 pts, Nifty IT posts best day 2nd July | Sakshi
Sakshi News home page

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఐటీ షేర్లకు మంచిరోజు

Jul 2 2026 3:59 PM | Updated on Jul 2 2026 4:06 PM

Stock Market Close Sensex jumps 579 pts, Nifty IT posts best day 2nd July

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. యూఎస్, ఇరాన్ వాణిజ్య చర్చల సానుకూల సంకేతాలపై చమురు ధరలు తగ్గడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు గణనీయంగా ఎగిశాయి. నిఫ్టీ 0.71 శాతం 169.85 పాయింట్ల లాభంతో 24,175.70 వద్ద, సెన్సెక్స్ 0.75 శాతం లేదా 579.48 పాయింట్లు పెరిగి 77,502.12 వద్ద ముగిశాయి.

ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ వరుసగా 0.48 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.25 శాతం పెరిగాయి. రంగాల వారీగా, నిఫ్టీ ఐటీ సెక్టోరల్ సూచీలను అధిగమించింది. 2025 మే  తర్వాత ఉత్తమ ఇంట్రాడే లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ రియాల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement