మంగళవారం ఉదయం శుభారంభం పలికిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 753.03 పాయింట్లు లేదా 0.96 శాతం లాభంతో 79,273.33 వద్ద, నిఫ్టీ 211.75 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,576.60 వద్ద నిలిచాయి.
శ్యామ్ టెలికాం లిమిటెడ్, ఏస్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, మనాక్సియా స్టీల్స్ లిమిటెడ్, వైశాలి ఫార్మా లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పశుపతి కాట్‌స్పిన్ లిమిటెడ్, సైబర్ మీడియా (ఇండియా) లిమిటెడ్, తంబోలి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అక్షిత కాటన్ లిమిటెడ్, సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


