సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 736.38 పాయింట్లు లేదా 0.97 శాతం లాభంతో 76,264.33 వద్దఎం నిఫ్టీ 231.00 పాయింట్లు లేదా 0.98 శాతం లాభంతో 23,853.90 వద్ద నిలిచాయి.
మెగెల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్, ఏబీ కాట్‌స్పిన్ ఇండియా లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్, ఎక్సీకామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్, గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శార్దూల్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎక్సారో టైల్స్ లిమిటెడ్, హెచ్‌బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, రవీందర్ హైట్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


