మంగళవారం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 416.73 పాయింట్లు లేదా 0.54 శాతం నష్టంతో 76,886.91 వద్ద, నిఫ్టీ 97.00 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,995.70 వద్ద నిలిచాయి.
అబాన్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఏజీఐ గ్రీన్‌ప్యాక్ లిమిటెడ్, వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఊర్జా గ్లోబల్ లిమిటెడ్, బి&ఎ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఎమామి రియల్టీ లిమిటెడ్, యూనికామర్స్ ఇ-సొల్యూషన్స్ లిమిటెడ్, లక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విసాగర్ పాలిటెక్స్ లిమిటెడ్, ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


