మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్! | Stock Markets Close In Green, Sensex And Nifty Gain, But Sun TV Shares Take A Hit Amid Polls | Sakshi
Sakshi News home page

మార్కెట్ గ్రీన్.. సన్ టీవీ రెడ్!

May 4 2026 3:53 PM | Updated on May 4 2026 4:39 PM

Stock Market Closing Update Sun Tv Network Shares Down

సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 355.90 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 77,269.40 వద్ద, నిఫ్టీ 121.75 పాయింట్లు లేదా 0.51 శాతం లాభంతో 24,119.30 వద్ద నిలిచాయి.

కాలిఫోర్నియా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్, ఐఎఫ్‌బి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాలర్ ఎస్టేట్ లిమిటెడ్, స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ లిమిటెడ్, ఒమాక్స్ ఆటోస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేతాన్ టిఎమ్‌టి లిమిటెడ్, మనోమయ్ టెక్స్ ఇండియా లిమిటెడ్, ఇన్సోలేషన్ ఎనర్జీ లిమిటెడ్, జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, కేఎస్‌బి లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిసినప్పటికీ.. తమిళనాట ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో.. కలానిధి మారన్ స్థాపించిన 'సన్ టీవీ నెట్‌వర్క్' షేర్స్ మాత్రం భారీ పతనం చవిచూడాల్సి వచ్చింది. సంస్థ షేర్స్ ట్రేడింగ్ క్లోసీ అయ్యే సమయానికి 5.38 శాతం పడిపోయాయి. ఉదయం 10:40 గంటలకు, సన్ టీవీ షేర్లు 8% తగ్గి ఒక్కో షేరుకు రూ. 557.65 వద్ద ట్రేడవుతున్నాయి. ఆగస్టు 2024 తర్వాత ఈ స్టాక్ ఒకే రోజులో అత్యంత భారీ పతనాన్ని నమోదు చేసింది.

Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
 
Advertisement
Advertisement