లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 07 July 2026 | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Jul 7 2026 3:42 PM | Updated on Jul 7 2026 3:47 PM

Stock Market Closing Update 07 July 2026

మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 104.35 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 78,180.72 వద్ద, నిఫ్టీ 31.65 పాయింట్లు లేదా 0.13 శాతం నష్టంతో 24,398.70 వద్ద నిలిచాయి.

షేర్ ఇండియా సెక్యూరిటీస్ లిమిటెడ్, ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, డీబీ (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్, కొథారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్, మెరైన్ ఎలక్ట్రికల్స్ (ఇండియా) లిమిటెడ్, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement