శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 982.71 పాయింట్లు లేదా 1.27 శాతం నష్టంతో 76,681.29 వద్ద.. నిఫ్టీ 275.10 పాయింట్లు లేదా 1.14 శాతం నష్టంతో 23,897.95 వద్ద నిలిచాయి.
ఇమామి రియల్టీ లిమిటెడ్, ఖైతాన్ (ఇండియా) లిమిటెడ్, కంచి కర్పూరం లిమిటెడ్, శేఖావతి ఇండస్ట్రీస్ లిమిటెడ్ , మాస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఆన్లాన్ హెల్త్‌కేర్ లిమిటెడ్, ఏబీ కాట్‌స్పిన్ ఇండియా లిమిటెడ్, యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ లిమిటెడ్, ఖైతాన్ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


