భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL).. గుజరాత్‌లోని ఖోరాజ్‌లో కొత్త ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి రూ.35,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల వాహనాలు ఉంటుందని వెల్లడించింది.
గాంధీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో మారుతి సుజుకి ఎండీ శ్రీయుత్ హిసాషి టకేయుచి ముఖ్యమంత్రికి పెట్టుబడి లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా.. ఈ ప్రాజెక్ట్ ద్వారా 12,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ చర్య భారత్ - జపాన్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతతో గుజరాత్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా.. ప్రపంచ పెట్టుబడిదారులకు ఒక గమ్యస్థానంగా నిలిచిందని పటేల్ అన్నారు.
ఇదీ చదవండి: అమెరికన్ బ్రాండ్ కారుపై రూ.2 లక్షల డిస్కౌంట్!
గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (GIDC) అందించిన 1,750 ఎకరాల భూమిలో మారుతి సుజుకి గుజరాత్ ప్లాంట్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ వారం ప్రారంభంలో కంపెనీ గుజరాత్‌లో తన తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి భూమిని సేకరించడానికి రూ.4,960 కోట్ల ప్రతిపాదనను తన బోర్డు ఆమోదించిందని తెలియజేసింది.
Glad to witness the Investment Letter Handover by Maruti Suzuki India Limited to the Government of Gujarat for setting up a mega car manufacturing facility at Khoraj, with an investment of ₹35,000 crore.
Guided by the visionary leadership of Hon’ble Prime Minister Shri… pic.twitter.com/Kso6hLmDUL— Bhupendra Patel (@Bhupendrapbjp) January 17, 2026


