హైదరాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు రూ.1.55 కోట్ల బంగారాన్ని పట్టు కున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 14న షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి గురించి ముందస్తు సమా చారం ఉన్న డీఆర్‌ఐ అధికారులు అతడి బ్యాగేజీలో ఉన్న ఇస్ట్రీపెట్టె (ఐరన్ బాక్స్)ను విప్పి చూడగా మొత్తం 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.
ఆ బంగారం విలువ రూ.1.55 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. క్యారియర్‌గా ఆ బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దానిని ఎవరికోసం తెచ్చాడన్న విషయంపై దర్యాప్తు చేయగా, ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి కోసం తీసుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆదివారం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


