‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టింగ్ గురూ రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల గురించి మరోసారి హెచ్చరించారు. అంతర్జాతీ మార్కెట్‌ల ఒడిదొడుకుల నేపథ్యంలో ‘భారీ క్రాష్ మొదలంది’ అంటూ ‘ఎక్స్’లో (గతంలో ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.
లక్షల మంది ఇన్వెస్టర్లు ఆర్థికంగా వినాశనానికి గురవుతారని అంచనా వేశారు. సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలు హాని కలిగిస్తున్నాయని ఆయన నొక్కిచెప్పారు. వెండి (silver), బంగారం (gold) వంటి విలువైన లోహాలు, బిట్ కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టోకరెన్సీలు తిరోగమనం సమయంలో రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయని సూచించారు.
‘భారీ క్రాష్ మొదలంది. కోట్ల కొద్దీ పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోతాయి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం పెట్టుబడులే మిమ్మల్ని కాపాడేదది’ అంటూ తన ట్వీట్లో రాబర్ట్ కియోసాకి రాసుకొచ్చారు.
కియోసాకి (Robert Kiyosaki) ఇలా హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2025 ప్రారంభం ఫిబ్రవరిలో కూడా ఇలాగే "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" రాబోతోందంటూ అంచనా వేస్తూ ఇన్వెస్టర్లను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.
MASSIVE CRASH BEGININING: Millions will be wiped out. Protect yourself. Silver, gold, Bitcoin, Ethereum investors will protect you.
Take care— Robert Kiyosaki (@theRealKiyosaki) November 1, 2025


