బంగారం ధరలలో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఈ రోజు (నవంబర్ 21) ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గుముఖం పట్టాయి. అంటే గంటల వ్యవధిలో పసిడి ధరలు తారుమారయ్యాయి.
విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో బంగారం ధరలు ఉదయం రూ. 1,14,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,24,480 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 1,13,800 (రూ. 250 తగ్గింది), రూ. 1,24,130 (రూ. 280 తగ్గింది) వద్దకు చేరాయి.
ఢిల్లీలో కూడా ఉదయం పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి తగ్గింది. ఉదయం 24 క్యారెట్ల 10 గ్రామ్స్ ధర రూ. 200 (రూ. 1,24,630), 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 220 (రూ. 1,14,250) పెరిగింది. ఈ ధరలు సాయంత్రానికి వరుసగా రూ. 280 (రూ. 1,24,130), రూ. 250 (రూ. 1,13,800) తగ్గింది.
చెన్నైలో బంగారం ధరలు ఉదయం ఎలా ఉన్నాయో.. సాయంత్రానికి అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధరలు రూ. 1,14,600 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,25,020 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!


