కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, శుక్రవారంతో 40 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఉదయ్ కోటక్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
"నేటికి నలభై సంవత్సరాల క్రితం, నేను ముంబైలోని ఫోర్ట్‌లో 300 చదరపు అడుగుల కార్యాలయంలో రూ. 30 లక్షల మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించాను. అదే కోటక్ మహీంద్రా బ్యాంక్. మారుతున్న కాలంతో పాటు ఇది కూడా వృద్ధి చెందాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు... తుమ్ జియో హజారో సాల్" అని ఉదయ్ కోటక్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ కథ 1985లో ప్రారంభమైంది. ఉదయ్ కోటక్ తన కుటుంబ వస్త్ర వ్యాపారంలో ముందుకు సాగడానికి ఆసక్తి చూపలేదు. కానీ తన కుటుంబ సంస్థ కోటక్ & కో. అనుబంధంగా కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను రూ. 30 లక్షలతో ప్రారంభించారు. అదే సమయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి తిరిగి వచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా సంస్థలో భాగం కావడానికి రూ. 4 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత కోటక్ మహీంద్రా బ్యాంకుగా మారింది. ఈ రోజు బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.2 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆనంద్ మహీంద్రా ట్వీట్
కోటక్ బ్యాంకు 40 ఏళ్ల ప్రయాణంలో ఆనంద్ మహీంద్రా కూడా అభినందనలు తెలిపారు. "నీ ప్రయాణం నిజంగా ఒక అద్భుతం, ఉదయ్'' అని చెబుతూనే ఒక ఫోటోను షేర్ చేశారు. మీరు తదుపరి లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. నేను మిమ్మల్ని & మీ బృందాన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాను' అని అన్నారు.
కోటక్ మహీంద్రా గ్రూప్ గురించి
1985లో ప్రారంభమైన కోటక్ మహీంద్రా గ్రూప్ భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థలలో ఒకటి. ఫిబ్రవరి 2003లో, గ్రూప్ ప్రధాన సంస్థ అయిన కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి బ్యాంకింగ్ లైసెన్స్‌ను పొందింది, భారతదేశంలో బ్యాంకుగా మారిన మొట్టమొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ 'కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్' అయింది.
కోటక్ మహీంద్రా గ్రూప్ (గ్రూప్) ప్రతి రంగాన్ని కవర్ చేసే విస్తృత శ్రేణి ఆర్థిక సేవలను అందిస్తుంది. వాణిజ్య బ్యాంకింగ్ నుంచి స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ & ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వరకు విభిన్న ఆర్థిక అవసరాలను తీరుస్తుంది.
ఇదీ చదవండి: వారానికి 72 గంటల పని.. వారికి మాత్రమే!
కోటక్ మహీంద్రా గ్రూప్ UK, USA, గల్ఫ్ రీజియన్, సింగపూర్, మారిషస్‌లలోని అనుబంధ సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్, అబుదాబి, సింగపూర్, మారిషస్‌లలో దీని కార్యాలయాలు ఉన్నాయి. 31 మార్చి 2025 నాటికి, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ జాతీయ స్థాయిలో 2,148 శాఖలు, 3,295 ATMలు (క్యాష్ రీసైక్లర్లు సహా) కలిగి ఉంది.
Your journey is truly the stuff of legend, Uday.
Heartiest congratulations on the 40th anniversary of @KotakBankLtd.
For forty years, it’s been one of my greatest privileges to cheer for you as a friend, believer, and admirer.
And I’ll keep cheering, even louder, for you and… https://t.co/zRsEmXbvbE pic.twitter.com/XXUtvopqX7— anand mahindra (@anandmahindra) November 21, 2025


