బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి | Rich Dad Poor Dad Robert Kiyosaki Predicts Major Crash Sets Sky High Targets for Gold Bitcoin | Sakshi
Sakshi News home page

బంగారం ‘కొండంత’ లక్ష్యంతో కొంటున్నా: కియోసాకి

Nov 9 2025 2:57 PM | Updated on Nov 9 2025 3:55 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Predicts Major Crash Sets Sky High Targets for Gold Bitcoin

ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్డాడ్పూర్డాడ్‌’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. రాబోయే మార్కెట్ క్రాష్ గురించి మరోసారి అలారం మోగించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం వంటి హార్డ్ ఆస్తులపై తన బుల్లిష్ దృక్పథాన్ని మరింత రెట్టింపు చేశారు.

తాజాగాఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. యూఎస్ రుణం, ద్రవ్య విధానం, ఫెడరల్ రిజర్వ్పై తన అభిప్రాయాలను పంచుకుంటూ ట్రెజరీ ముద్రించినది "నకిలీ డబ్బు" అని అభివర్ణించారు. తాను బంగారం, వెండి, బిట్కాయిన్‌, ఎథీరియం ఆస్తులను ఎందుకు అమ్మడం లేదు.. ఇంకా కొంటున్నాడో వివరించారు.

కియోసాకి అంచనాలో భవిష్యత్తులో బంగారం ఔన్సుకు 27,000 డాలర్లకు చేరుకుంటుంది. బిట్ కాయిన్ 2026 నాటికి 250,000 డాలర్లకు పెరుగుతుంది. వెండి 100 డాలర్లకు చేరుతుంది. ఇక ఎథేరియం 60,000 డాలర్లను తాకుతుంది. యు.ఎస్. ప్రభుత్వం రుణ భారాన్ని విస్తరించడం కొనసాగిస్తున్నందున ఈ ఆస్తులు సాంప్రదాయ పొదుపును అధిగమిస్తాయని రాసుకొచ్చారు.

తాను గ్రేషమ్, మెట్కాఫ్ డబ్బు నియమాలను అనుసరిస్తానని చెప్పొకొచ్చారు. "దురదృష్టవశాత్తు, యు.ఎస్. ట్రెజరీ, ఫెడ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. తమ బిల్లులు చెల్లించడానికి నకిలీ డబ్బును ముద్రిస్తున్నాయి. ఫెడ్, ట్రెజరీ చేస్తున్నది మనం చేస్తే జైలులో ఉంటాం " అన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద అప్పులున్న దేశంగా నిలుస్తోంది. అందుకే "పొదుపు చేసేవారు నష్టపోతారు" అని నేను చాలాకాలంగా హెచ్చరిస్తున్నాఅన్నారు. అందుకే బంగారం, వెండి, బిట్కాయిన్‌, ఎథీరియంలను అవి క్రాష్అయినప్పుడు కూడా కొంటున్నానని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement