బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (నవంబర్ 22) గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే పెరిగింది. దీంతో పసిడి ధరలు పెరుగుదల దిశగా పరుగులు తీశాయి. ఇంతకీ ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇది బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అయింది. మన దేశంలో పెళ్లి అంటేనే చాలామంది ఆడంబరంగా జరుగుపుకుంటారు. ఇలాంటి సమయంలో గోల్డ్ కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14నాటికి సుమారు 48 లక్షల వివాహాలు జరగనున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా.
ఈ ఏడాది 48 లక్షల వివాహాలు జరుగుతున్నాయంటే.. బిజినెస్ కూడా రూ. 6.5 లక్షల కోట్లు ఉంటుందని CAIT తన నివేదికలో వెల్లడించింది. ఇందులో 15 శాతం (సుమారు రూ. 97,500 కోట్లు) గోల్డ్ బిజినెస్ ఉంటుంది. అంటే ఈసారి రూ. 97,500 కోట్ల విలువైన బంగారం సేల్.. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పసిడికి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఈ రోజు ధరలు ఇలా
నిన్న (నవంబర్ 21) స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు సమంత పెరిగింది. దీంతో బంగారం ధర గరిష్టంగా.. 1,860 రూపాయలు పెరిగి, రూ. 125840 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్దకు చేరింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి రేటు 1700 రూపాయలు పెరిగి.. రూ.115350 వద్ద నిలిచింది.
ఇదీ చదవండి: అప్పుడు రూ.30 లక్షలు.. ఇప్పుడు లక్షల కోట్ల కంపెనీ!


