నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వారం క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,200 ఉండగా, మంగళవారం రూ.1,50,800లకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.3.17 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరల పెరుగుదల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
వచ్చే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండటంతో బంగారం కొనుగోలుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, బంగారం, వెండిపై పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ.2 లక్షల వరకు దాటే అవకాశం ఉందని నగరానికి చెందిన ఆభరణాల తయారీదారు సీహెచ్.భూషణ్‌చారి ‘సాక్షి’తో తెలిపారు.


