39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్! | Central Banks Buying 39000 kg Gold in September 2025 World Gold Council Report | Sakshi
Sakshi News home page

39 టన్నుల బంగారం: అందుకే డిమాండ్!

Nov 6 2025 4:02 PM | Updated on Nov 6 2025 5:01 PM

Central Banks Buying 39000 kg Gold in September 2025 World Gold Council Report

భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. నేడు (నవంబర్ 06) 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.21 లక్షల వద్ద ఉంది. రేటు పెరగడానికి ప్రధాన కారణం.. పండుగ సీజన్ మాత్రమే కాదు. వివిధ దేశాల బ్యాంకులు ఎక్కువ మొత్తంలో పసిడి కొనుగోలు చేయడం కూడా.. అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.

2025 సెప్టెంబర్ నెలలో కేంద్ర బ్యాంకులు గరిష్టంగా 39 టన్నుల (39,000 కేజీలు) బంగారం కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. ఈ ఏడాది మొత్తంలో గోల్డ్ కొనుగోళ్లు సెప్టెంబర్‌లో జరిగినట్లు సమాచారం. కాగా.. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేసిన బంగారం 634 టన్నులు కావడం గమనార్హం.

సెప్టెంబర్ 2025లో.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ 15 టన్నుల గోల్డ్ కొనుగోలు చేయగా.. బ్యాంక్ ఆఫ్ గ్వాటిమాలా 6 టన్నులు కొనుగోలు చేసింది. రష్యా బ్యాంక్ 3 టన్నులు, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజికిస్థాన్ 8 టన్నుల బంగారం కొనేసింది. టర్కీ బ్యాంక్ మాత్రం 2 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడంతో.. పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిందని గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.

ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!

తగ్గుతున్న గోల్డ్ రేటు - కారణాలు
సెంట్రల్ బ్యాంకుల విషయాన్ని పక్కనపెడితే.. పెట్టుబడిదారులు కూడా బంగారం సురక్షితమైన పెట్టుబడి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కూడా గోల్డ్ ధరలను పెంచేసింది. అయితే ప్రస్తుతం గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. దీనికి కారణం.. అమెరికా డాలర్ బలపడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, రాజకీయ పరిస్థితులు అని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement