భారతదేశంలో బంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగి, అక్టోబర్ నెలలో రూ. 2 లక్షలకు (కేజీ) చేరుకుంది. అయితే నేడు (నవంబర్ 4) సిల్వర్ రేటు రూ. 1.65 లక్షల వద్ద ఉంది. అంటే ఏ స్థాయిలో వెండి రేటు తగ్గిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ.. వెండి ధరలు భవిష్యత్తులో భారీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారీగా పెరిగిన వెండి ధరలు, కొనుగోలుదారులను కొంత కలవరపెట్టినా.. ఇటీవల కొంత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎఎమ్‌సిలో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ప్రిన్సిపల్ 'చింతన్ హరియా' మాట్లాడుతూ.. వెండిని ఆభరణంగా మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగంలో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి వెండి వినియోగం పెరుగుతుంది. తద్వారా రేటు పెరుగుతుందని అన్నారు. వెండికి డిమాండ్ పెరుగుతూ ఉండటం వల్ల.. గత మూడేళ్ళలో సిల్వర్ రేటు 30శాతం పెరిగిందని పేర్కొన్నారు.
వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు.
ఈరోజు సిల్వర్ ధరలు
ఈరోజు (మంగళవారం) వెండి రేటు రూ. 3000 తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నగరాల్లో కేజీ సిల్వర్ రేటు రూ. 1.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి ధర రూ. 1.51 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో సిల్వర్ రేటు కొంత తక్కువ అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో కనిపించని ఏసీ: యాంటిలియాలో ఎందుకిలా?


