బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ కొనసాగుతున్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు తగ్గింది. దీంతో పసిడి ధరలలో మరోమారు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 మాత్రమే తగ్గింది. సాయంత్రానికి ఈ ధర రూ. 600లకు చేరింది. అంటే సాయంత్రానికి మరో 450 రూపాయలు తగ్గిందన్నమాట. కాగా 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 550 తగ్గింది (ఉదయం రూ. 150 మాత్రమే తగ్గింది). ప్రస్తుతం బంగారం ధరలు వరుసగా రూ. 1,24,260 (24 క్యారెట్స్), రూ. 1,13,900 (22 క్యారెట్స్) ఉన్నాయి.
ఢిల్లీలో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్లో ఉదయం సాయంత్రానికి తేడా ఉంది. ఉదయం నుంచి సాయంత్రానికే గరిష్టంగా రూ. 600 తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,14,050 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,24,410 వద్ద ఉంది.
ఇదీ చదవండి: లక్షకు రెండు లక్షలు!: బంగారంలాంటి లాభాలు
చెన్నైలో మాత్రం బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఉదయం ఎంత రేటు ఉందో.. సాయంత్రానికి అంతే ఉంది. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,15,000 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,25,460 వద్ద ఉంది. అయితే వెండి ధరల్లో సాయంత్రానికి ఎటువంటి మార్పు లేదు.


