ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే.. తప్పకుండా పొదుపు చేయాలి. ఈ పొదుపును సరైన మార్గంలో పెట్టుబడిగా పెడితే.. ఊహకందని లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్వెస్ట్ చేయడానికి స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్, రియల్ ఎస్టేట్ వంటి చాలామార్గాలు ఉన్నాయి.
ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చేది అనే విషయాన్ని వెల్త్ మోజో.. తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి, ఈరోజు దాని విలువ సుమారుగా..
- నిఫ్టీ 50: రూ. 1.8 లక్షలు
- నిఫ్టీ నెక్స్ట్ 50: రూ. 2.2 లక్షలు
- మిడ్‌క్యాప్ ఇండెక్స్: రూ. 2.7 లక్షలు
- స్మాల్ క్యాప్ ఇండెక్స్: రూ. 3.1 లక్షలు
- బంగారం: రూ. 1.9 లక్షలు
- వెండి: రూ. 2.0 లక్షలు
- ఫిక్స్డ్ డిపాజిట్: రూ. 1.35 లక్షలు
- రియల్ ఎస్టేట్: రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.25 లక్షలు
- బిట్‌కాయిన్: రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు
దీన్నిబట్టి చూస్తే ఐదు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి.. ఇప్పుడు సుమారు రూ. 2 లక్షలు వస్తుందన్నమాట. అంటే లక్ష రూపాయలకు, మరో లక్ష లాభం. కాగా బంగారం వెండి ధరలు కూడా ఐదేళ్లలో ఊహకందని రీతిలో పెరిగాయి.
ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..
If you had invested ₹1,00,000 five years ago, here’s what it would roughly be worth today:
📊 Nifty 50: ~₹1.8L
🚀 Nifty Next 50: ~₹2.2L
📈 Midcap Index: ~₹2.7L
🔥 Smallcap Index: ~₹3.1L
🪙 Gold: ~₹1.9L
🥈 Silver: ~₹2.0L
🏦 Fixed Deposit: ~₹1.35L
🏢 REITs/InvITs:…— Wealthmojo™ (@wealthmojo1) November 18, 2025


