అంతలోనే ఇంత తేడానా.. మారిపోయిన బంగారం, వెండి ధరలు! | Gold and Silver Price All Time Hike Know The Latest Rate | Sakshi
Sakshi News home page

అంతలోనే ఇంత తేడానా.. మారిపోయిన బంగారం, వెండి ధరలు!

Nov 13 2025 9:11 PM | Updated on Nov 13 2025 9:21 PM

Gold and Silver Price All Time Hike Know The Latest Rate

బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియుల మదిలో గుబులు పుట్టిస్తున్నాయి. ఈ రోజు (నవంబర్ 13) ఉదయమే గరిష్టంగా రూ. 2290 పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 3110కు చేరింది. అంటే ఉదయం నుంచి సాయంత్రానికే.. బంగారం రేటు రూ. 820 పెరిగింది. వెండి ధర కూడా కేజీపై మరో రూ. 1000పెరగడంతో.. రూ. 1.83 లక్షలకు చేరింది.

రూ.10 వేలు పెరిగిన వెండి
గురువారం ఉదయం వెండి రేటు రూ. 9000 పెరిగింది. సాయంత్రానికి మరో 1000 రూపాయలు పెరగడంతో.. మొత్తం రూ. 10,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 1,83,000 వద్దకు చేరింది. గత వారంలో స్థిరంగా ఉన్న వెండి రేటు మళ్లీ పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతోంది. ఈ ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టదని స్పష్టమవుతోంది.

బంగారం ధరలు ఇలా
ఇక బంగారం ధరల విషయానికి వస్తే.. అసలే విపరీతంగా పెరుగుతున్న పసిడి ధర ఇప్పుడు రోజుకు రెండు సార్లు పెరగడంతో.. కొనుగోలుదారులలో ఆందోళన కలుగుతోంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రస్తుతం.. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి  రూ. 1,17,900 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 3110 పెరిగి రూ. 1,24,620 వద్దకు చేరింది.

చెన్నైలో కూడా గోల్డ్ రేటు సాయంత్రానికే తారాస్థాయికి చేరింది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3260 పెరిగి రూ. 1,29,820 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 3000 పెరిగి రూ. 1,19,000 వద్దకు చేరింది.

ఇదీ చదవండి: వెండి ధర అక్కడికి!.. కియోసాకి ట్వీట్

చివరగా దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 2850 పెరిగి రూ. 118050 వద్దకు చేరగా.. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 3110 పెరిగి.. రూ. 128770కు చేరింది. మొత్తం మీద దేశ వ్యాప్తంగా బంగారం ధరలు సాయంత్రానికే తారుమారయ్యాయి.

నిపుణులు ఏం చెబుతున్నారంటే?
బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. బంగారం సురక్షితమైన ఆస్తి కాబట్టి ఎక్కువమంది పెట్టుబడి పెట్టడం లేదా కొనుగోలు చేయడంతో పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. వెండిని ఆభరణాల కోసం మాత్రమే కాకుండా.. పారిశ్రామిక రంగాల్లో కూడా విరివిగా ఉపయోగించడం వల్ల దీని ధర కూడా అమాంతం పెరిగిపోయింది. సిల్వర్ రేటు పెరుగుతుంది.. ధర పెరగకముందే కోనేయండి అంటూ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సైతం చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement