సుదీర్ఘ సొరంగ రహదారి | World longest expressway tunnel in China | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ సొరంగ రహదారి

Jan 18 2026 12:55 AM | Updated on Jan 18 2026 12:55 AM

World longest expressway tunnel in China

ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సొరంగ రహదారి. చైనా ప్రభుత్వం గత డిసెంబర్‌ 16న దీనిని ప్రారంభించింది. టియాన్‌షాన్‌ పర్వతశ్రేణుల వద్ద కొండలను తొలిచి నిర్మించిన ఈ సొరంగ రహదారి పొడవు 22.13 కిలోమీటర్లు. ఉరుంకీ నగరం నుంచి కోర్లా నగరానికి వెళ్లేందుకు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో చైనా ప్రభుత్వం ఈ సొరంగ రహదారిని నిర్మించింది. ఉరుంకీ నుంచి కోర్లాకు ఇదివరకు ఏడుగంటలు పట్టేది.

ఈ సొరంగం వల్ల ప్రయాణ సమయం మూడున్నర గంటలకు తగ్గింది. దాదాపు ఏడువందల మీటర్ల లోతున ఈ సొరంగ మార్గాన్ని నిర్మించడం వల్ల అతి శీతల వాతావరణంలో సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది. టియాన్‌షాన్‌ పర్వతశ్రేణుల వద్ద శీతకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ 42 డిగ్రీల సెల్సియస్‌ వరకు పడిపోతుంటాయి. పూర్తిగా మంచు నిండిన మార్గంలో వాహనాలు ప్రయాణించడం దుస్సాధ్యంగా ఉండేది. ఈ సొరంగం నిర్మించడం వల్ల మంచు కారణంగా ఆటంకాలు లేకుండా, సురక్షితంగా సునాయాసంగా ప్రయాణించేందుకు వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement