దొడ్డబళ్లాపురం: కర్ణాటకలోని కార్వార్‌లో అరేబియా సముద్ర తీరంలోని భారతీయ నౌకాదళ స్థావరంలో ఓ పక్షి అనుమానాస్పదంగా కనిపించింది. కదంబ నేవీ బేస్ పరిధిలో మంగళవారం జీపీఎస్ ట్రాకర్ కలిగిన సీగల్ బర్డ్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్షికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇది చైనాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
చైనా భాషలో ఎకో ఎన్విరాన్మెంట్ అని రాసి ఉంది. చైనాలోని ఆ సంస్థతో సంప్రదించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. కార్వార్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గూఢచర్య పక్షిగా అనుమానాలను వ్యక్తం చేశారు.


